రూ.2 వేల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోటును వినియోగదారులకు ఇవ్వబోమని తెలిపింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లు ఇస్తే రూ.2 వేల నోటును తీసుకుంటామని పేర్కొంది. రూ.2 వేల నోటును డిసెంబర్ 2019 నుంచి ముద్రించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెద్ద నోటు రద్దవుతుందా అనే సందేహాలకు ఆర్బీఐ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మనీ లాండరింగ్ అని చెబుతున్నాయి. పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నారని భావించడంతో రూ.2 నోటు వెనక్కి తీసుకుంటుంది.
బ్యాంకులే కాదు ఏటీఎం మిషన్లలో కూడా రూ.2 వేలు నోటు కనిపించదు. పెద్ద నోటు లోడ్ చేయొద్దు అని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టంచేసింది. సో.. ఇకపై రూ.2 వేల నోటు కనిపించదు. రూ.2 వేల నోటు రద్దు చేస్తారని గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఆర్బీఐ చర్యలను బట్టి అది నిజమేనని అనిపిస్తోంది. నోటు రద్దు చేసేందుకే పరిమితి విధించి ఉంటారు. 2016లో వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేశారు. ఫేక్ కరెన్సీ, ఇతర కారణాలు చెప్పి బ్యాన్ చేయడంతో జనం ఇబ్బంది పడ్డారు. నగదు కోసం ఏటీఎం క్యూ లైన్లో నిల్చొని 150 మందికి పైగా చనిపోయారు.