పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తన సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన కాస్త అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఆయన అనారోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. అసలు ప్రభాస్‌కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. ఇటీవల వరుసగా సినిమాల షూటింగ్‌లతో ప్రభాస్ బిజీ అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు హైఫీవర్ వచ్చిందట. తీవ్రంగా జ్వరం రావడంతో వెంటనే సినిమా షూటింగ్స్ అన్నీ ఆపేసి ఆయన ఆసుపత్రిలో చేరారట.
తీవ్రమైన జ్వరం రావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు కూడా చెప్పారట. దీంతో ప్రభాస్ సినిమాల షూటింగ్స్ అన్నీ కొన్నిరోజుల వరకు వాయిదా పడ్డాయి. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం బాగానే ఉంది అని, హై ఫీవర్ తగ్గిందని.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని ఆయన సన్నిహితులు ప్రభాస్ అభిమానులకు చెబుతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా షూటింగ్‌తో పాటు నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొంటున్నారు. చిన్న గ్యాప్ దొరికితే మారుతి సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూడు సినిమాలు అయిపోతే పఠాన్ డైరెక్షన్లో మరో మూవీలో నటించనున్నారు ప్రభాస్.