అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ నటిస్తోన్న వేట్టయాన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు బిగ్ బీ హాజరుకాకపోవడంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో 1991లో వారిరువురు కలిసి నటించిన ‘హమ్’ మూవీ సెట్స్‌లో జరిగిన సన్నివేశాలను గుర్తుచేసుకున్నారు. సెట్స్‌లో తాను ACలో పడుకోగా.. రజినీ మాత్రం నేలపై పడుకున్నారని తెలిపారు. రజినీ సాదాసీదాగా ఉండటం చూసి, తాను వాహనం నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకున్నానని చెప్పుకొచ్చారు.