VZM: తెర్లాం మండలం బాధితులకు ఎమ్మెల్యే బేబీ నాయన శనివారం ఆర్థిక సాయం చేశారు. ఏంఆర్ అగ్రహారం గ్రామంలో ఇటీవల రెండు ఆవులు కరెంట్ షాక్కు గురై చనిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబి నాయనాపాడి రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తమ్మయ్యవలస గ్రామంలో బొత్స ఈశ్వరమ్మ ఇంటిపై పిడుగు పడి ఇంట్లో ఉన్నసామాన్లు ధ్వంసం అయ్యాయని, రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు.