ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని మధురైలో జరుగుతోంది. దసరా కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది.