కృష్ణా: విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.