చిత్తూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 23న కుప్పం పర్యటనకు విచ్చేయనున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 23న ఉదయం 11 గంటలకు కుప్పంలోని బ్రాంచ్ కెనాల్ టేక్ ఆఫ్ పాయింట్, కే1 పంపింగ్ హౌస్లు తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం చేరుకుని అధికారులతో సమీక్షించనున్నారని తెలిపారు.