నెల్లూరు: కావలి మద్దూరుపాడులోని ఏఎంసీ మార్కెట్ ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ బాజీ బాబు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9,130ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.