బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తన టెస్టు కెరీర్లో 6 సెంచరీలు నమోదుచేశాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్సుల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 58 ఇన్నింగ్సుల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ గంగూలీ(57) రికార్డును బ్రేక్ చేశాడు.