2007 టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్సుల ఊచకోత గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు. అయితే ఆ రోజు యువీ 7 సిక్సులు కొట్టాల్సింది. కానీ అంపైర్ కారణంగా ఆ ఏడో సిక్స్ మిస్సైంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ తెలిపాడు. ‘ఆ ఓవర్ రీప్లే నేను ఇంతవరకూ చూడలేదు. కానీ, ఒక్క విషయం చెప్పాలి. అంపైర్ చూడకపోవటం వల్ల ఆ ఓవర్లో నోబాల్ వేసినా తప్పించుకోగలిగా. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేవాడు’ అని తెలిపాడు.