KMM: ముదిగొండ మండలం బాణాపురం హై స్కూల్ నందు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన వాలీబాల్, ఖో ఖో, కబడ్డీ పోటీల్లో విజయం సాధించిన జట్లకు మండల విద్యాశాఖ అధికారులు బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని అధికారులు పేర్కొన్నారు.