యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేటర్ల ఆగడాలు రోజురోజుకి శృతి మించుతున్నాయి. ఫేమస్ అవవడం కోసం బైక్ స్టెంట్స్ చేసిన వారిని, స్పీడ్ రాసులలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసేవారు. తాజాగా హర్ష అనే యూట్యూబర్‌ను కేపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు.
హర్ష ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వ్యూస్ కోసం కోసం రద్దీగా ఉండే రోడ్లపై డబ్బు విసిరికొట్టడం, జనం ఆ డబ్బు కోసం ఎగబడి విజువల్స్ చిత్రికరించి అవి అప్లోడ్ చేయడం వంటి చర్యలు చేయడం ఇప్పుడు అతన్ని ఇబ్బందిలో పడేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి, పబ్లిక్‌లో తీవ్ర ప్రతిస్పందనకు గురయ్యాయి. ప్రజలు అతని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు హర్షను అరెస్టు చేసి, మూడు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రజలకు బిజీ ప్రాంతాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో ఇబ్బంది కలిగేలా రీల్స్ చేయడం మరియు రద్దీని సృష్టించడం నిబంధనలు విరుద్ధం అని… ఆలా చేస్తే కఠినచర్యలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు