తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం ఉదయం సన్నీ నానా సాహెబ్ వాఘ్చౌరే అనే పూణే కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం వచ్చినట్లు సమాచారం. వారు సుమారు 25 కిలోల బంగారపు ఆభరణాలు ధరించి, తిరుమల శ్రీవారిని VIP బ్రేక్ దర్శనం చేసుకున్నారు. ఈ ఆభరణాల ధర సుమారు 15 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ ఘటనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చకు కారణమైంది.
ఈ బంగారపు ఆభరణాల ధర అనేది చాలామంది నెటిజన్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరు ఈ చర్యను “ముఖ్యంగా దేవుడి ముందు ఇలాంటి ఆర్భాటం అవసరమా అంటూ కామెంట్ చేశారు. మరోవైపు, ఆదాయపు పన్ను శాఖ ఈ పరిణామాలపై ప్రత్యేకంగా గమనిస్తున్నదని కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో బంగారపు ఆభరణాలు ధరించడం ఇలాంటివి తప్పుగా భావించవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.