అక్కినేని నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనేక రూమర్లు, పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వచ్చాయి. అయినప్పటికీ సెలెబ్రిటీల ఇంట పెళ్లిళ్లు అంటే హంగు, ఆర్భాటం ఉంటాయి. ఇవేమి లేకుండా ఒక్కసారిగా నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం ఫోటోలు పెట్టడంతో అభిమానులు, తెలుగు ప్రజలు షాక్ తిన్నంత పనయ్యింది. అంత హడావిడిగా, కొంతమంది సమక్షంలో మాత్రమే నిశ్చితార్థం ఎందుకు చేసారో ఎవరికీ అర్థంకాలేదు
దీని గురించి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూ లో నాగార్జున స్పందించారు. ‘ చెయ్ – శోభిత ఇష్టపడుతున్నారని తెలుసు, వాళ్ళు పెళ్లి పై చాలా క్లారిటీతో ఉన్నారు, వాళ్ళు 100% డిసైడ్ అయ్యారని తెలిశాక… ఆగష్టు 8న చాలా మంచి రోజు అని తెలిసి ఇంట్లోనే నిశ్చితార్థం చేశాం. ఇద్దరి జాతకాలు, నక్షత్రాలు ప్రకారం ఆరోజు మంచిదని చెప్పారు. సో అందుకే ముందుకు వెళ్ళాం’ అని అన్నారు
అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య – శోభితల నిశ్చితార్థం జరిగింది. నాగార్జున, నాగ చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి, అమల, అఖిల్ మాత్రమే ఉన్నారు. శోభిత కుటుంభం తరుపు ఆమె తల్లిదండ్రులు, సోదరి మాత్రమే వేడుకలో ఉన్నారు. మొత్తానికి చెయ్ బాబు త్వరలో మళ్ళీ పెళ్లిపీటలు ఎక్కనున్నాడు