స్టాక్ మార్కెట్ లో లాభనష్టాలు సహజం. కానీ ఒక్కోసారి అవి ఊహాతీతంగా ఉంటాయి. 24 గంటల క్రితం అంబానీ కంపెనీ చేసిన ఒక ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో జరిగినా మార్పులవల్ల అంబానీ కంపెనీ భారీగా నష్టపోయింది. వివరాల్లోకి వెళితే
మార్కెట్ వేల్యూ ప్రకారం దేశంలో అత్యధిక సంపన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనికి అధినేత ముకేశ్ అంబానీ. ఆసియా ఖండంలో అత్యధిక సంపన్నుడు ముకేశ్ అంబానీ.జూలై 22, 2024 నాటికి ఫోర్బ్స్ సంస్థ ప్రకారం 9 లక్షల 76 వేల 320 కోట్ల నెట్ వర్త్ తో అంబానీ ఆసియా లోనే మొదటి సంపన్నుడు.
గత జూన్ క్వార్టర్ లో అంబానీ కంపెనీ లాభాల్లో 5 శతం తగ్గుముఖం పట్టడంతో రిలయన్స్ షేర్లు 3 శతం పడిపోగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాల్యూయేషన్ లో భారీగా తేడా కనిపించింది.
బ్లూచిప్ స్టాక్ 3.49 శాతం పడిపోయి రూ.3,001.10 వద్ద ఆగింది. రోజులో, ఇది NSEలో 3.56 శాతం తగ్గి రూ. 2,998.80కి చేరుకుంది, ఇది 3.41 శాతం క్షీణించి రూ. 3,004కి చేరుకుంది.మొత్తానికి ఒక పెద్ద కంపెనీలో లాభాల శాతంలో స్వల్పంగా మార్పు జరిగినా షొచ్క్ మార్కెట్ పరంగా భారీ నష్టాలు నమోదవుతున్నాయి