నీట్-యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది.
NEET-UG: నీట్-యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని 40కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వాళ్లకి ఎక్కువ మార్కులు వచ్చాయా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ జాబితాను కోరింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, అయితే విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ నేడు ఫలితాలను విడుదల చేసింది. దీనిపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.