అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం తాను ఆస్వస్థతకు గురయింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు.
Jhanvi kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం తాను ఆస్వస్థతకు గురయింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు. మరో రెండు రోజులు హాస్పటల్లోనే ఉండబోతుందని చెప్పారు. ఇటీవల చెన్నై ఎయిర్‌పోర్టులో తాను తీసుకున్న ఆహారం కారణంగానే స్టమక్ అప్సెట్ అయిందని, తద్వారా బాడీ మొత్తం డీహైడ్రెట్ అయిందని దాంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు చెప్పారు. జాన్వీ అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని, షూటింగ్స్‌లో భాగంగా అలిసిపోవడం, శరీరానికి సరైన విశ్రాంతి లేకపోవడం వలన ఇలా జరిగిందని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పినట్లు బోనీ కపూర్ తెలిపారు.
బాలీవుడ్ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ మధ్యే తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంతో స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాఫ్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇంకా తెలుగు కథలు వింటున్నట్లు తెలుస్తుంది. అలాగే జూలై 12న జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలో కూడా ఈ అందాల భామ మెరిసింది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అలరిస్తుంది. ఇన్‌స్టాలో తన సొగసైన ఫోటోలను షేర్ చేస్తు కుర్రకారును కట్టేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉన్న క్రమంలో త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు.