»Akshay Kumar The Star Hero Movie That Brought Bollywood To Samosa
Akshay Kumar: బాలీవుడ్‌ని సమోసా వరకు తీసుకొచ్చిన స్టార్ హీరో సినిమా?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను తన లేటెస్ట్ సినిమా సమోసా వరకు తీసుకొచ్చిందనే సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అసలు అక్షయ్ కుమార్ సినిమాకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
Akshay Kumar: The star hero movie that brought Bollywood to Samosa?
Akshay Kumar: ఈ డిజిటల్ యుగంలో.. ఏదైనా సరే అరచేతిలోనే ఉంటుంది. ఎలాంటి కంటెంట్ అయిన సరే.. ఓటిటి సంస్థలు పుష్కలంగా అందిస్తున్నాయి. ఏం కావాలన్నా సరే.. ఒక్క క్లిక్ చాలు. ఇలాంటి సమయంలో ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అంటే మాటలు కాదు. కంటెంట్ సాలిడ్‌గా ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. హిట్ టాక్ వస్తే ఓకె.. లేదంటే మూడు రోజుల్లోనే సినిమా థియేటర్ నుంచి అవుట్ అయిపోతుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన సరే. అందులోను.. హిందీ సినిమాల పరిస్థితి ఈ మధ్య అస్సలు బాగాలేదు.
ముఖ్యంగా అక్షయ్ కుమార్ లాంటి హీరో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. పోయిన వారం అక్షయ్ నటించిన ‘సర్ఫిరా’ అనే సినిమా రిలీజ్ అయింది. ఇది సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సుధా కొంగరనే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించింది. కానీ అక్షయ్‌ని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది సర్ఫిరా మూవీ. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్ కూడా రాలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సర్ఫిరా థియేటర్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు బంపర్ ఆఫర్స్ ప్రకటించాయి.
జనరల్‌గా అయితే.. బై వన్ గెట్ వన్ ఆఫర్స్, లేడీస్‌కు స్పెషల్ డిస్కౌంట్స్, పిల్లలకు ఫ్రీ.. అంటూ గతంలో కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి కొత్త కొత్త ఆఫర్లు పెట్టారు. కానీ ‘సర్ఫిరా’ సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు మాత్రం రెండు సమోసాలు, ఒక టీ ఉచితంగా అందిస్తున్నారు. దీంతో.. సమోసా, టీ కోసం సినిమా చూడాలా అంటూ.. సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా సరే.. బాలీవుడ్ సినిమా పరిస్థితి సమోసా వరకు వచ్చిందనే చెప్పాలి.