»Even If I Am In The Heart Of Prime Minister Modi What To Do With Photos Pawan Kalyan
Pawan Kalyan: నేను ప్రధాని మోడీ గుండెల్లో ఉన్నా.. ఫోటలతో పనేంటి
జనసేన పార్టీకి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అన్నీ తట్టుకొని నిలుచుంది. ఇలాంటి కష్టాలు ఏ ఇతర పార్టీకి వచ్చినా ఓ పాతిక రోజులు కూడా మనగలివి కావు అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.
Even if I am in the heart of Prime Minister Modi.. What to do with photos.. Pawan Kalyan
Pawan Kalyan: కూటమి ప్రభుత్వం విజయం వెనుక జనసేన పార్టీ నేతల కష్టం ఉందని జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. వేసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన అణచివేత ఉండేది అని, ప్రజలు ఎవరు స్వేచ్చగా రోడ్లమీదకు రాలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సమాజిక మాధ్యమాలల్లో పోస్టులు పెట్టాలంటే భయపడేవారని, ఇంట్లో ఉన్న పిల్లలను, ఆడవాల్లను కూడా వారు భయపెట్టారని చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి కొట్టిన తీరును కూడా చూశామన్నారు. ఎంతో కాలం సీఎంగా పనిచేసే, సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును జైలుకు పంపించిన తీరును చూశామన్నారు. ఇసుక దోపిడి, భూకబ్జాలు, కుంభకోణాలు అందుకు ఆంధ్ర ప్రజలు ఒక్కటై వారికి బుద్ధి చెప్పారని పవపన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీ గుండెల్లోనే ఉన్నాను.. పక్కన నిల్చొని ఫొటో దిగాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేయాలన్నారు. జనసేన పార్టీ తీసుకున్న మంత్రి పదవులన్ని ప్రజలకు దగ్గరగా ఉన్నవేనని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని జనసేన ఎంపీలను ఉద్దేశించి చెప్పారు. ప్రతీ అంశంలో అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం అవసరమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజార్టీ రాలేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నట్లు చెప్పారు. ఇక వైసీపీ నేతలు మనకు ప్రత్యర్థులు మాత్రమే అని శత్రువులు కారు అని చెప్పారు. వారు చేసిన ప్రతీ తప్పుకు చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.