»Arvind Kejriwal Kejriwal Is The Main Conspirator In The Delhi Liquor Scam Case
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. కేజ్రీవాలే ముఖ్య కుట్రదారు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారని ఈడీ ఆరోపించింది. ఆ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని తెలిపింది.
Arvind Kejriwal: Kejriwal is the main conspirator in the Delhi liquor scam case
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారని ఈడీ ఆరోపించింది. ఆ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని తెలిపింది. ఈ కేసులో ఈడీ కేజ్రీవాల్‌పై అభియోగపత్రం దాఖలు చేసింది. మంత్రుల కమిటీ ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ కట్టకథ చెప్పారంది. నిన్న పీఎంఎల్ఏ కోర్టు అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంది. 12వ తేదీన కేజ్రీవాల్‌ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది.
ఈడీ 209 పేజీలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఇందులో కీలక కుట్రదారుగా పేర్కొంది. ఈ కేసులో రూ.100 కోట్లలో కొంత 2022లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ వినియోగించుకుందని తెలిపింది. ప్రతి విషయంలోనూ ఆయన కుట్ర ఉంది. ఈ కేసులో శిక్షకు ఆయన అర్హుడు. విచారణలో ఆయన స్టేట్మెంట్ను 11 సార్లు రికార్డు చేశారు. కానీ సరైన సమాధానం ఇవ్వలేదు. విషయాలను దాయడానికి ప్రయత్నించారని ఈడీ తెలిపింది. కానీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసులో తనని ఇరికించారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.