జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో పాటు వార్ 2 కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు.. దాదాపుగా దేవర పనైపోయినట్టేనని అంటున్నారు. అలాగే వార్ 2 క్లైమాక్స్‌కు రెడీ అంటున్నారు.
Just like 'Devara' failed.. this time the climax of 'War 2'?
Devara: కొరటాల శివ దర్శకత్వంలో.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యాక్షన్ పార్ట్, టాకీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో.. ప్రస్తుతం కొరటాల పాటల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్, జాన్వీలపై ఓ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. నెక్స్ట్ కూడా ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్లో మరో సాంగ్ షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ స్పెషల్ సెట్‌ను రెడీ చేస్తున్నారట. వచ్చే వారం నుంచి షూటింగ్ ఉంటుందని సమాచారం. మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషిస్తోన్న హిమజ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఈ లెక్కన దేవర షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టే.
అందుకే.. ఎన్టీఆర్ ‘వార్ 2’షెడ్యూల్ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల నాలుగో వారం నుంచి ‘వార్ 2’ క్లైమాక్స్‌ను షూట్ చేస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల పై హై ఓల్టేజ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. అసలు ఎన్టీఆర్, హృతిక్ కాంబో అన్నప్పుడే.. ఇది బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మారిపోయింది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాను బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. స్పై యూనివర్స్‌లో భాగంగా యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అందుకే.. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి దేవర, వార్ 2 ఎలా ఉంటాయో చూడాలి.