»Not Only Does It Decrease It Has To Decrease With The Wife Allu Arjun
Allu Arjun: తగ్గేదేలే కాదు, భార్య దగ్గర తగ్గాల్సిందే.. అల్లు అర్జున్
తగ్గేదేలే.. అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బన్నీ మ్యానరిజానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. కానీ బన్నీ మాత్రం ఓ విషయంలో తగ్గాల్సిందేనని చెప్పడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడం.. ఆసక్తికరంగా మారింది.
Not only does it decrease, it has to decrease with the wife.. Allu Arjun
Allu Arjun: పుష్ప సినిమా చూసిన తర్వాత.. ఏ విషయమైనా సరే.. ఎంతటి వారైన సరే.. తగ్గేదేలే అని అంటుంటారు. పుష్ప2లో అస్సలు తగ్గేదేలే.. అని అంటున్నాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు 15న రావాల్సిన పుష్ప2.. డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయింది. కాబట్టి.. ఇప్పట్లో పుష్ప2 అప్టేట్స్ చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమా పై మాత్రం అంచనాలు గట్టిగా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్పరాజ్‌కు యమా క్రేజ్ ఉంది. అందుకే.. ఈసారి అస్సలు తగ్గేదేలే అంటున్నాడు అల్లు అర్జున్. కానీ.. ఓ విషయంలో మాత్రం తగ్గాల్సిందేనని బన్నీ చెప్పడం విశేషం. తాజాగా ఆడి కారును నడిపి సందడి చేశాడు బన్నీ. కార్స్ విత్ ట్రాక్స్ ఎడిషన్‌లో భాగంగా స్పెషల్ రేస్ ట్రాక్ పై బ్లూ కలర్ ఆడి కారును డ్రైవ్ చేశాడు బన్నీ.
ఈ సందర్భంగా.. తొలిసారి రేసింగ్ ట్రాక్ పై కారు నడిపిన ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందని అన్నాడు బన్నీ. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మీరు వంగి కారు లోపలికి వెళ్లగలరా? అని బన్నీని అక్కడున్న హోస్ట్ అడగ్గా.. ఎందుకు? ఏమైనా సమస్య ఉందా? అని అన్నాడు బన్నీ. దీంతో. పుష్ప మూవీలో తగ్గేదేలే అంటారుగా.. అందుకే అలా అడిగానని హోస్ట్ చెప్పాడు. అప్పుడు బన్నీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘అవును నేను కూడా తగ్గగలను. అది నా భార్య ముందు అలవాటు పడ్డాను. వైఫ్ ముందు తగ్గాలి కదా’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే.. బన్నీ తన భార్య దగ్గర తగ్గాల్సిందే అన్నమాట. అన్నట్టు.. బన్నీ భార్య స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటో షూట్లు షేర్ చేస్తుంటుంది.