»Devotees In Large Numbers Are Gathered In Puri To Celebrate The Second Day Of Rath Yatra
Puri : రెండో రోజు కొనసాగుతున్న పూరీ జగన్నాథ రథ యాత్ర
పూరీ జగన్నాథ రథ యాత్ర వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. లక్షల మంది భక్తులతో పూరీ క్షేత్రం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Puri : పూరీ క్షేత్రం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. జగన్నాథుని రథ యాత్ర రెండో రోజూ ప్రారంభమై కొనసాగుతోంది. దాదాపుగా 53 సంవత్సరాల తర్వాత ఈ రథ యాత్రను వరుసగా రెండో రోజూ( Second Day) చేపట్టారు.1971లో ఇలాగే రెండు రోజుల పాటు రథయాత్ర జరిగింది. మళ్లీ ఇప్పుడే జరుగుతోంది.
ఈ రథ యాత్రలో ఇదే చివరి రోజు. దీంతో లక్షలాది మంది భక్తులు పూరీ వీధుల్లో చేరిపోయారు. ఆలయ ప్రాంగణంతో పాటు పూరీ అంతా భక్తులతో కోలాహలంగా ఉంది. దేశం నలమూలల నుంచి లక్షలాది మంది అక్కడకు చేరుకున్నారు. భక్తులంతా జై జగన్నాథ, హరిబోల్ అంటూ పెద్దగా నినాదాలు చేస్తున్నారు. భక్తి పారవశ్యంతో రథాన్ని ముందుగు నడిపిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తారని అధికారులు ముందుగానే అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లన్నీ చేశారు.
మొదటి రోజు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవానికి హాజరయ్యారు. మొదటగా రథం లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా ఇలా ఈ యాత్రకు హాజరు కాలేదు. మొదటి సారిగా ద్రౌపది ముర్ముయే ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అయితే మొదటి రోజైన ఆదివారం ఈ రథోత్సవంలో(Rath Yatra) అపశ్రుతి చోటు చేసుకుంది. రథం లాగేందుకు భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో దాదాపుగా 300 మందికి గాయాలయ్యాయి.