»Finland The Company That Made A New Protein With Wind And Electricity
Finland: గాలి, విద్యుత్‌తో కొత్త ప్రొటీన్‌ను తయారు చేసిన కంపెనీ
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఉంది. అయితే ఫిన్లాండ్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాలి, విద్యుత్‌తో ఓ ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది.
Finland: The company that made a new protein with wind and electricity
Finland: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఉంది. అయితే ఫిన్లాండ్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాలి, విద్యుత్‌తో ఓ ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది. సోలార్ అనే ఫుడ్స్ కంపెనీ సొలీన్ అనే ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేసింది. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పౌడర్‌ను గాలి, విద్యుత్‌ను ఉపయోగించి తయారు చేసింది. నేషనల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ ఆహారాన్ని కనుగొన్నట్లు సోలార్ ఫుడ్స్ సీఈవో తెలిపారు. హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈ ప్రొటీన్ పౌడర్‌ను తయారుచేసినట్లు తెలిపారు.
విద్యుత్ ద్వారా హెచ్ 2, గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అందించి ట్యాంకుల్లో సూక్ష్మజీవిని తయారు చేశారు. ఈ జీవినే ఎండబెట్టి పౌడర్ చేస్తారని తెలిపారు. పసుపు రంగులో ఉండే ఈ ప్రొటీన్ పౌడర్‌లో అన్ని విటమిన్లు, అమినో యాసిడ్లు ఉన్నాయని తెలిపారు. ఎండిన మాంసంలో ఉండే పోషకాలే ఇందులో కూడా దాదాపుగా ఉంటాయని తెలిపారు. ఎడారులు, మంచు ప్రదేశాలు లేదా ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పౌడర్ తయారుచేసుకోవచ్చు. మొక్కల ద్వారా చేసే ఆహార ఉత్పత్తితో పోలిస్తే కేవలం ఒక్క శాతం నీటితో, ఐదు శాతం భూవిస్తీర్ణంలో సొలీన్ ప్రొటీన్‌ను తయారుచేయవచ్చని తెలిపింది.