Gold Rates Today : పెరిగిన వెండి, బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
రెండు, మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం వెండి, ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెండి ఒకసారి తగ్గడం, ఒకసారి పెరగడం అన్నట్లు ట్రెండ్ నడిచింది. బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగినా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. అయితే గురువారం మాత్రం ఈ రెండు లోహాల ధరలు పెరిగాయి. దేని ధర ఎంత ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర గురువారం రూ.740 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర దేశీయ మార్కెట్లో రూ.74,760కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల కూడా పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,760గానే కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ మొదలయ్యే సమయంలో ఉన్నవి మాత్రమే. తర్వాత మళ్లీ పెరగొచ్చు. అలాగే నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి సైతం అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు గురువారం భారీగా పెరిగాయి. ఒక్క రోజే ఏకంగా రూ.1530 పెరిగిపోయాయి. దీంతో కేజీ వెండి ధర నేడు రూ.92,670కి చేరింది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లోనూ సిల్వర్ ధరలు దాదాపు ఇలానే కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్ ధర పెరిగింది. గురువారం ఒక్కరోజే ఏకంగా 26 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2358 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 30.39 డాలర్లుగా ఉంది.