»Prabhas The Biggest Star Of This Era Prabhas Makers Of Kalki 2 Update
Prabhas: ఈ యుగంలో అతిపెద్ద స్టార్ ప్రభాస్.. ‘కల్కి 2’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
ప్రస్తుతం 'కల్కి 2898 ఏడి' సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో.. ఈ యుగానికి అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. అలాగే.. నిర్మాత అశ్వనీద్ కల్కి 2 గురించి అప్డేట్ ఇచ్చారు.
Prabhas: The biggest star of this era Prabhas.. Makers of 'Kalki 2' update!
Prabhas: ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించాలన్న, వాటిని తిరగరాయాలన్న ప్రభాస్‌కే సాధ్యమని చెప్పాలి. ఏడు రోజుల్లోనే సలార్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టేసింది కల్కి 2898 ఏడి. నాలు రోజుల వరకు రోజుకి వంద కోట్ల రాబట్టి.. ఫస్ట్ వీకెండ్లో 555 కోట్లు వసూలు చేసిన కల్కి.. వీక్‌డేస్‌లో యావరేజ్‌గా 50 కోట్లకు పైగా రాబట్టి.. ఆరు రోజుల్లో 700 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇదే ఊపులో టికెట్ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి.. సెకండ్ వీకెండ్ వరకు వెయ్యి కోట్ల క్లబ్లో చేరనుంది కల్కి. ఇక ఉత్తర అమెరికాలో 13 మిలియన్స్ డాలర్స్ రాబట్టి దూసుకుపోతోంది. దీంతో.. మేకర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ యుగంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సెట్లో జస్ట్ అలా ప్రభాస్ క్యాజువల్‌గా కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగి. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘దీనంతటికి కారణం ఇక్కడ కూల్‌గా కూర్చుని ఉన్న ఈ వ్యక్తినే.. ఈ యుగం బాక్సాఫీస్ స్టార్ అతడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మా ప్రొడక్షన్‌కి చాలా కాన్ఫిడెంట్ ఇచ్చాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకునేలా స్వేచ్ఛ ఇచ్చాడు.
అందరి డార్లింగ్, మన భైరవ.. ఇప్పుడు ప్రపంచంలో K.. అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు నాగ్ అశ్విన్. మరోవైపు.. నిర్మాత అశ్వనీ దత్ కల్కి 2 అప్డేట్ ఇచ్చారు. పార్ట్ 2 బాలన్స్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. కల్కి 2898 ఏడి క్లైమాక్స్‌లో కల్కి యూనివర్స్ ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు నాగ్ అశ్విన్. అందుకే.. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.