Acne Issue: ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్, డార్క్ సర్కిల్స్ , మొటిమల మచ్చలను పోగొట్టుకోవడానికి ఇది ఉత్తమ ఎంపిక. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ చర్మంపై ముడుతలను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖాన్ని కాంతివంతంగా మార్చుతాయి. పెరుగులో జింక్ ఉంటుంది, ఇది మొటిమలను నివారిస్తుంది. మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఫేస్ ప్యాక్స్ ప్రయత్నించండి.
అరకప్పు పెరుగు, ఒక అవకాడో , 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ మిక్స్ చేసి ప్యాక్ తయారు చేయండి. ఆ తర్వాత మీ ముఖం , మెడపై అప్లై చేయండి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పోగొట్టడానికి సహాయపడుతుంది. పెరుగులో ప్రోటీన్లు, విటమిన్ డి, ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన లేదా మెరిసే చర్మానికి అవసరం. ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ పొడి ఓట్స్ మరియు ½ టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ని మీ ముఖం , మెడపై అప్లై చేయండి. వోట్మీల్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి , ముఖాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించవచ్చు. అరకప్పు పెరుగు ,1 టేబుల్ స్పూన్ పసుపు కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం , మెడకు అప్లై చేయండి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.