»If You Give Information On Ganja Rs 2 Lakh In Cash Declared Narcotics
Narcotics: గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు నగదు బహుమతి
రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం అన్ని విధాల కసరత్తులు చేస్తుంది. దీనిలో భాగంగా గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి నార్కోటిక్స్ పోలీసుల విభాగం భారీగా నజరాన ప్రకటించింది. డ్రగ్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.
Narcotics: తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించడానికి ప్రభుత్వం అన్ని విధాల కసరత్తులు చేస్తుంది. ఈ విషయంలో నార్కోటిక్స్ పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అవసరం అయితే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసైనా సరే ఆ డ్రగ్స్‌ను అరికడుతాము అని వెల్లడించారు. తాజాగా దీనిపై నార్కోటి్స్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని వెల్లడించారు. వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని తెలిపారు. స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలి అనుకుంటే 8712671111 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు ఉండవద్దని, దానికోసం అందరూ సామాజిక బాధ్యతగా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. యువతకు భవిష్యత్తుకు ఈ మహామ్మారి ఎంత చెడు చేస్తుందో వీడియో రూపంలో చెప్పిన మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు. చిరంజీవిలా సినిమావాళ్లందరూ ముందుకొచ్చి వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. అలాగే మీడియాకు కూడా హితవు చెప్పారు. కేవలం రాజకీయ అంశాలనే ఫోకస్ చేయకుండా డ్రగ్స్, స్మగ్లింగ్ లాంటి వాటిపై ఫోకస్ పెంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రేవంత్‌రెడ్డి సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాపై చిత్తశుద్ధితో పనిచేసే పోలీసులకు తగిన ఫలితం ఉంటుందని చెప్పారు. దీనికోసం అందరూ స్వచ్చందంగా ముందుకు రావాలని పౌరసంబంధాలశాఖ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, థియేటర్ యజమానులు, సినిమా ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. డ్రగ్స్ మత్తులో జరిగే నేరాల గురించి చెబుతూ.. ఇటీవల జరిగిన చిన్నారులపై అఘాయిత్యాలు ఈ మత్తులోనే జరిగినవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.