Gold and Silver Rates Today : బంగారం, వెండి లోహాల మీద పెట్టుబడులు పెట్టడం అనేది భారతీయులకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకనే కాస్త రేటు తగ్గితే అవసరమైనవి కొనుక్కుందాని చాలా మంది చూస్తూ ఉంటారు. అలా వీటిని కొనుగోలు చేయాలనే ఆలోచనల్లో ఉన్న వారు వీటి రేట్లపై ఎప్పుడూ ఓ లుక్కేసి ఉంచాల్సిందే. మరి నేటి ధరల్ని తెలుసుకునేందుకు ఇది చదివేయండి.
దేశీయ మార్కెట్లో బంగారం ధర దాదాపుగా స్థిరంగానే ఉంది. సోమవారం ఉదయం రూ.7 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.73,914కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ధరలు దాదాపుగా ఇలానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలాంటి చోట్లా పసిడి ధర(Gold Rate) రూ.73,914గానే ఉంది. అయితే నగల కొనుగోలుదారులు మరో విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరతోపాటు అదనంగా మజూరీ, జీఎస్టీల్లాంటి వాటినీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) సోమవారం భారీగా పెరిగింది. రూ.1266 పెరగడంతో కేజీ వెండి ధర రూ.91,033కు చేరుకుంది. గత వారం అంతా 90వేల దిగువన ఉన్న వెండి ఇప్పుడు మళ్లీ 91వేల పై చిలుకుకు చేరింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్లా దీని ధరలు ఇలానే ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సైతం స్థిరంగా ఉంది. శనివారం ఉన్న రేటే కొనసాగుతోంది. శనివారం ఔన్సు స్పాట్ గోల్డ్ 2326 డాలర్లు ఉండగా సోమవారమూ అదే ధర పలుకుతోంది. ఔన్స్ వెండి 29.13 డాలర్లుగా ఉంది.