»Kalki 2898 Ad Kalki Theme Song Raises Expectations
Kalki 2898 AD: అంచనాలు పెంచేసిన ‘కల్కి’ థీమ్ సాంగ్!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. మరోవైపు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. లేటెస్ట్గా కల్కి థీమ సాంగ్ అంచనాలను అమాంతం పెంచేసింది.
Kalki 2898 AD: ఇప్పటికే కల్కి 2898 ఏడి అడ్వాన్స్ బుకింగ్స్ అంతకుమించి అన్నట్టుగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఇదే సమయంలో కల్కి నుంచి వచ్చిన థీమ్ సాంగ్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఇప్పటి వరకు కల్కి నుంచి వచ్చిన యాంథమ్ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అది టైటిల్ కార్డ్ ప్రమోషనల్ సాంగ్ కాబట్టి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడొచ్చింది కల్కి థీమ్ సాంగ్. ఈ పాటలో కథ మొత్తాన్ని చెప్పేశాడు నాగి. ‘కల్కి’ గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణునికి సంబంధించిన ఈ సాంగ్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం గ్యారెంటీ.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు, చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఇదే సమయంలో కల్కి గురించి సంతోష్ నారాయణన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రయాణించే ప్రపంచానికి రెండు నుండి మూడు రకాల ట్యూన్లు ఉంటాయని అన్నాడు. అంతేకాదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ, సినిమా చూసిన తర్వాత మామూలుగా ఉండదని అన్నాడు. ఇప్పుడు థీమ్ సాంగ్ చూసిన తర్వాత కల్కి బీజిఎం పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు బుకింగ్స్ పరంగా సినిమా దుమ్ములేపుతోంది. దీంతో తొలి రోజు భారీ ఓపెనింగ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. బుకింగ్ ట్రెండ్ చూస్తే.. ఫస్ట్ డే 200 కోట్లకుపైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి కల్కి డే వన్ ఎంత రాబడుతుందో చూడాలి.