»Horoscope Today Todays Horoscope 2024 June 25th This Zodiac Sign Achieves Success With The Advice Of Family Members
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 25th).. ఈ రాశివారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు
ఈ రోజు(2024 June 25th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
Horoscope Today: Today's horoscope (2024 June 25th)..This zodiac sign achieves success with the advice of family members
మేషం
ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. వృషభం
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి. మిథునం
మిశ్రమ కాలం. మీ పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. ఇష్టదేవతా ధ్యానం మంచిది.
కర్కాటకం
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది. సింహం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.. కన్య
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
తుల
మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదువుకోవాలి. వృశ్చికం
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం. ధనుస్సు
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయ స్థానంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
మకరం
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం. కుంభం
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు,మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. ఇష్టదేవతా ఆలయ సందర్శనం శుభప్రదం. మీనం
ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.