Pawan kalyan: విజయవాడ క్యాంపు కార్యలయం పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా తన క్యాంపు ఆఫీస్‌ను సందర్శించారు. నేడు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్‌కు స్వాగతం పలికారు.
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జనసేనాని కాన్వాయ్‌తో విజయవాడ క్యాంపు ఆఫీస్‌కు వెళ్లారు. పవన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన కార్యలయాన్ని చూశారు. అనంతరం జనసేన పార్టీ కార్యలయానికి బయలుదేరారు.
జూన్ 19 బుధవారం డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని సమాచారం. పవన్ కల్యాణ్‌కు సోమవారం ఛాంబర్ కేటాయించిన విషయం తెలిసిందే. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గదిని కేటాయించారు. తాజాగా దాన్ని మార్చి 211లోకి పవన్ కల్యాణ్ తన కార్యలయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను నిర్వర్తించనున్నారు.