Tiger Attachked: నెల్లూరు జిల్లాలో కారుపై పులి దాడి
ఆంధ్రప్రదేశ్లో మరో పులి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానిక గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Tiger Attachked: ఆంధ్రప్రదేశ్లో పులి సంచారం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ కారుపై పులి దాడి చేసింది. దాంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టున్నారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు-ముంబయి ఒక కుటుంబం కారులో వెళ్తున్నారు. అప్పటి వరకు పాటలు వింటూ నెమ్మదిగా కారు ప్రయాణిస్తుంది. జనసంచారం కూడా సరిగ్గా లేదు. కారుకు అడ్డంగా పెద్దపులి ఆకారం కనిపింది. కారులో ఉన్నవారు దాన్ని గుర్తించేలోపే కారుపే పెద్దపులి దాడి చేసింది.
కారుపై తన పంజ విసిరింది. దీంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. కాస్త ఏమరపాటుగా ఉన్నా పులి చేతిలో తాము మరణించే వారని ప్రయాణీకులు వాపోతున్నారు. అయితే కారు బయటనుంచే పులి దాడి చేయడంతో కారులో ఉన్నవారంత శరీరకంగా సురక్షితంగానే ఉన్నా.. మానసికంగా మాత్రం భయపడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాస్తులు ఉలిక్కిపడ్డాయి. దీనిపై తగిన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.