»Italy Pm Giorgia Meloni Takes Selfie With Pm Modi At G7 Meet Pic Goes Viral
Selfie : వైరల్ వీడియో… మోదీతో సెల్ఫీ దిగిన ఇటలీ ప్రధాన మంత్రి
రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మరింది. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇటలీ ప్రధాని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు నెట్లో హల్ చేస్తోంది.
Giorgia Meloni: దేశాధినేతలు సెల్ఫీ దిగితే నెట్టింట అది వైరల్గా మారకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనే ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ( Pm Giorgia Meloni) సెల్ఫీ తీసుకున్నారు. సెల్ఫీ తీసుకునే సమయంలో ఇద్దరూ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లుగా కనిపించారు. మెలోనీ చేతితో ఫోన్ని పట్టుకుని సెల్ఫీ తీస్తుండగా మోదీ(Modi) అందుకు చక్కగా ఫోజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తీసుకున్న వీడియోని సైతం మెలోనీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఇలా ఇద్దరు దేశాధినేతలు మనసారా నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోను అంతా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వీడియోని సైతం అంతా లైక్ చేస్తున్నారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇటలీలోని అపులియాలో ఆ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ కలుసుకున్న వీరిద్దరూ ఇలా సెల్ఫీ దిగగా ఆ ఫోటో వైరల్గా మారింది. గతేడాది దుబాయ్లో కాప్ 28 సదస్సు జరిగింది. అక్కడ కూడా వీరిద్దరూ ఇలానే సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఆ ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది. నరేంద్ర మోదీ మూడో సారి భారత్కు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇలా ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటలీ(Italy) ప్రధానితో భద్రత, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ అంశాలపై చర్చలు జరిపారు.