Graduate MLC: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు రౌండ్లు పూర్తి అయ్యాయి. మూడో రౌండు కొనసాగుతోంది. ఈరోజు సాయాంత్రానికి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కించడం ముగుస్తుంది.
Graduate MLC: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను ముందుగా కట్టలు కట్టారు. ఆపై 96 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. అందుకోసం 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొదటి రౌండులో 7,670 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అలాగే రెండవ రౌండ్లో కూడా అదే జోరు కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు 14,672 ఓట్లతో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఆ తరువాత బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కొనసాగుతున్నారు.
రెండవ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 34,575 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రేమేందర్ రెడ్డి 12,841 రాగా స్వాతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018 ఓట్లు నమోదు అయ్యాయి. అయితే చిత్తు ఓట్లే సైతం రౌండు రౌండుకు వేలల్లో చిత్తు అవుతున్నట్లు తెలుస్తుంది. మే 27 న పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు.