sabja water : ఉదయాన్నే ఈ పానీయంతో డయాబెటీస్‌కు చెక్
ఉదయాన్నే ఒకటి రెండు గ్లాసుల సబ్జా నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజూ చేయడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుందట. ఇంకా ఈ నీటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
sabja water benefits : ఇటీవల కాలంలో ఏ ఇంట్లో చూసినా డయాబెటిక్ పేషెంట్లు ఉంటున్నారు. అంతగా ఈ వ్యాధి పెరిగిపోతోంది. అయితే ఉదయాన్నే ఒకటి, రెండు గ్లాసుల సబ్జా నీటిని తాగడం వల్ల మధుమేహం(diabetes) దరి చేరదని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది రక్తంలో చక్కెరల్ని మెయింటెన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందువల్ల చాలా వరకు మనకు మధుమేహం ముప్పు తప్పుతుంది.
మరెన్నో లాభాలున్న ఈ సబ్జా నీటిని(sabja water) రోజూ ఉదయాన్నే తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే భోజనానికి కొద్దిగా ముందు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సడన్‌గా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అందువల్ల టైప్ 2 డయాబెటీస్(diabetes) ముప్పు తగ్గుతుంది. అందుకనే డయాబెటీస్ మ్యానేజ్మెంట్లో ఈ నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అలాగే వేసవి కాలంలో ఈ నీటిని తాగడం వల్ల ఇవి మన శరీరాన్ని సహజంగా చల్లబరుస్తాయి.
ఈ మధ్య కాలంలో చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు సబ్జా గింజలను రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ నీటిని తరచుగా తాగుతూ ఉండాలి. అందువల్ల ప్రధానంగా మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లో పెక్టిన్ అనే సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ కోశంలోని మెటబాలిజంని పెంచుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికీ ఈ నీరు సహాయకారిగా ఉంటుంది.