Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 1st)..అనుకోని ప్రయాణాలు చేస్తారు.
ఈ రోజు(2024 June 1st) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
బంధువులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అకస్మాత్తుగా డబ్బు చేజారే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ ఎక్కువౌతుంది.
వృషభం
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులలో ఇబ్బందులు వస్తాయి.
మిథునం
కోరుకునేది జరగదు. మరోకటి జరుగుతుంది. అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి. సమయం ప్రకారం భుజిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలపట్ల అశ్రద్ధ పనికిరాదు.
కర్కాటకం
స్త్రీల వలన లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సింహం
ధనలాభం ఉంది. మీమీరంగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కొత్తగా మొదలు పెట్టే పనులకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కఠిన సంభాషణ మానుకోవాలి. వేరే వాళ్లకు హానితలపెట్టే పనులకు దూరంగా ఉండాలి.
తుల
ఆరోగ్యంపై జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. సహనం అన్నివిధాలా మంచిది.
వృశ్చికం
కొత్త వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ధనలాభం పొందుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది.
విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు.
ధనుస్సు
పిల్లలవల్ల ఇబ్బందులు ఉంటాయి. పై అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు ఉండవు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి.
మకరం
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పనులు వాయిదా వేసుకోక తప్పదు.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళనలు ఉన్నాయి. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అవుతారు.
మీనం
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాలు చేయడంలో జాగ్రత్త మంచిది. అన్ని పనులు ధైర్యంగా చేయాలి.