ప్రస్తుతం మాస్ మహారాజా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు రవితేజ కొత్త సినిమా ఏది రిలీజ్ కావడం లేదు.. మరి ఎందుకు ట్రెండింగ్‌లోకి వచ్చాడు? అనేదే కదా మీ డౌట్. అయితే ఈ న్యూస్ చదివేయండి.
Ravi Teja: చివరగా ఈగల్ సినిమాతో పర్వాలేదనిపించిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం హరిష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. తాజాగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా.. గతేడాది దసరా కానుకగా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ.. తాజాగా ఓ అరుదైన ఘనతను మాత్రం సొంతం చేసుకుంది. సైన్ ల్వాంగేజ్‌లో ఈ మూవీని ఓటిటిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారతీయ సినీ చరిత్రలో సైన్ లాంగ్వేజ్‌లో ఓటిటిలో విడుదలైన మొదటి సినిమాగా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకు ఎక్కింది. వినలేని, మాట్లాడలేని వాళ్ల కోసం సైన్ లాంగ్వేజ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఆడియోని వినలేకపోవచ్చు కానీ.. సినిమా కథేంటి? డైలాగ్స్ ఏంటి? అనేవి సైన్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోవచ్చు. దీంతో.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చాడు మాస్ రాజా. ఇక టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటించగా రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మించగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.