»Once Again Ravi Teja And Srileela Combo This Time Full Daawat
Ravi Teja: మరోసారి రవితేజ, శ్రీలీల కాంబో.. ఈసారి ఫుల్ ‘దావత్’
మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన ధమాకా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్‌గా నిలవగా.. శ్రీలీల డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ధమాకా కాంబో ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
Ravi Teja: యంగ్ బ్యూటీ శ్రీలీల అనగానే.. ముందుగా డ్యాన్సే గుర్తొస్తుంది. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. రెండో సినిమాతోనే మాస్ మహారాజా రవితేజతో ఛాన్స్ కొట్టేసింది. ధమాకా సినిమాలో మాస్ రాజాతో కలిసి దుమ్ముదులిపేసింది శ్రీలీల. అమ్మడి డ్యాన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అసలు ధమకా సినిమా హిట్ అవడానికి కారణం శ్రీలీల డ్యాన్స్ అనే చెప్పాలి. రవితేజ, శ్రీలీల తమ మాసివ్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించారు. దీంతో మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఒక్కటే ఉంది. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని అంటున్నప్పటికీ, ఇంకా ఏది కూడా అనౌన్స్ కాలేదు. కానీ ఇప్పుడు రవితేజతో మరోసారి ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
రవితేజ 75వ సినిమాతో భాను భోగవరపు అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనే రవితేజకు జోడీగా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ కూడా పూర్తి అవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ‘రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’ అని చెప్పుకొచ్చారు మేకర్స్. అలాగే.. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, రవితేజ పాత్ర పేరు ‘లక్ష్మణ భేరి’ అని కూడా తెలిపారు. ఏదేమైనా.. మరోసారి శ్రీలీలతో కలిసి రవితేజ దావత్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే చెప్పాలి.