Cyber Crime :పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయంటూ కాల్స్ వస్తే నమ్మొద్దంటున్న పోలీసులు
సైబర్ క్రైం నేరగాళ్లు ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రంగా మనుషులను టార్గెట్ చేస్తున్నారు. మీ ఫెడెక్స్ పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని, అడిగిన మొత్తం చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారంటే..?
South Korea: A cyber criminal who goes by the name of Musk
FedEx Parcel Cyber Crimes in Telangana : ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఫెడెక్స్(FEDEX) స్కాం ద్వారా మధ్య తరగతి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు. ‘మీ పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయి. మీ మీద కేసు నమోదు చేస్తున్నాం’ అంటూ మాట్లాడుతున్నారు. ఆ కొద్ది సేపటికే ముంబై సైబర్ క్రైమ్(CYBER CRIME) బ్రాంచ్ పోలీసు అధికారుల అవతారంలో మళ్లీ ఫోన్లో మాట్లాడుతున్నారు. దీంతో కొంత మంది భయపడిపోయి వారికి డబ్బులు ట్రాన్స్వర్ చేస్తున్నారు. అలా తమ విలువైన డబ్బును పోగొట్టుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో హైదరాబాద్(HYDERABAD) నగరంలో చాలా పెరిగిపోయాయి. ఇలాంటి బాధితుల్లో 27 శాతం మంది మధ్య తరగతి కుటుంబాల వారే. పోలీసుల పేరుతో ఫోన్లు రావడంతో వారంతా భయాందోళనలకు గురై చివరికి డబ్బులు చెల్లించేస్తున్నారు. దీంతో ఇలాంటి సైబర్ నేరాలు ఈ మధ్య తరచుగా వెలుగు చూస్తూ ఉంటున్నాయి.
ఈ విషయమై సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ మాట్లాడారు. ఎవరైనా ఇలాంటి ఫోన్లు చేసినప్పుడు కంగారు పడకుండా లాజిక్‌తో ఆలోచించమని సూచించారు. లేకపోతే ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. చాలా మంది వారు అడకముందే డబ్బులు ఇచ్చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు గాబరా పడిపోకుండా నిదానంగా లాజిక్ ఆలోచించాలని ఆయన సూచించారు.