రష్మిక మంచి జోరు మీద ఉంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం పుష్ప2 లో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న ఆమె.. త్వరలో ఎన్టీఆర్ తో జోడీ కట్టనుంది.
NTR: రష్మిక మంచి జోరు మీద ఉంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం పుష్ప2 లో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్న ఆమె.. త్వరలో ఎన్టీఆర్ తో జోడీ కట్టనుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఓవైపు దేవర షూటింగ్ చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో తన ఎంట్రీ కోసం చాలా శ్రమిస్తున్నాడు. రీసెంట్ గానే వార్ 2 షూటింగ్ లో అడుగుపెట్టాడు. అయాన్్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. వార్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కంప్లీట్ యాక్షన్ డ్రామా గా ఈ మూవీ సాగనుంది. దీనికి డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇది మైత్రీ మూవీ మేకర్స్ మరియు కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ద్వారా బ్యాంక్రోల్ చేయబడింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రాజెక్ట్ యొక్క కాస్టింగ్ ఎంపికకు సంబంధించి ఒక అద్భుతమైన బజ్ ఇంటర్నెట్లో లీక్ అయింది. దాని ప్రకారం, ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నను సంప్రదించారట. వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రష్మిక.. వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక నటించిన పుష్ప2, సికిందర్.. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.