Gold and Silver Rates Today : ధరలు తగ్గితే పసిడి, వెండిని కొనుక్కోవాలని చూస్తున్న వారికి శుభవార్త. శుక్రవారం ఈ లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజులోనే వేలల్లో దిగివచ్చాయి. మరి వీటి నేటి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర శుక్రవారం రూ.1,573 తగ్గింది. ఒక్కరోజే ఇంత మొత్తంలో తగ్గడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.74,127కు చేరుకుంది.
చదవండి : ప్రభాస్ ‘బుజ్జి’ కార్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?
ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,127గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. నగల్ని కొనే సమయంలో జీఎస్టీ, మజూరీల్లాంటివి వీటికి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వారిపై కేసు.. లోగో ఫైనల్ కాలేదన్న సజ్జనార్
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శుక్రవారం భారీగా తగ్గింది. ఒక్కరోజే రూ. 2,795 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర సోమవారం రూ.91,885కు చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనూ వెండి ధర రూ.91,885గానే కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర శుక్రవారం 39 డాలర్లు తగ్గి 2330కి చేరుకుంది. ఔన్సు వెండి 30.24 డాలర్లుగా ఉంది.

