7 types of Gold investment in 2024: ETFs to mining stocks and more
Gold and Silver Rates Today : పసిడిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు రోజూ దాని ధరల్ని గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రికార్డు హైలో నడుస్తున్న బంగారం ధర గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. రూ. 700 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో నేడు పది గ్రాముల పసిడి ధర రూ.75,700కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ75,700గా కొనసాగుతోంది. అయితే ఈ ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నదని గుర్తుంచుకోవాలి. నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు మజూరీ, జీఎస్టీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో ఆకాశాన్నంటుతున్న వెండి ధర(Silver Rate)లు సైతం కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.94,680కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ఒక్క రోజే ఔన్సు బంగారం ధర ఏకంగా 40 డాలర్లు తగ్గింది. దీంతో దీని ధర 2369 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర 30.74 డాలర్లకు చేరుకుంది.