»Payal Rajput Remuneration Issues With Rakshana Movie Producers
Payal Rajputh: తనను ఇండస్ట్రీలో లేకుండా చేస్తామంటున్నారన్న పాయల్
మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
Payal Rajputh : తెలుగు మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఆమె ఇన్స్టాగ్రాం ఖాతాలో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆమె పోస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమెను బెదిరించడానికి వెనక ఉన్న కారణాలను సైతం ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
‘రక్షణ’ అనే తెలుగు సినిమాలో నటించేందుకు పాయల్ 2019-2020ల్లో ఒప్పందం చేసుకున్నారు. దాని విడుదల అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రావడంతో ప్రచారంలో పాల్గోవాలని చిత్ర బృందం ఆమెను ఫోర్స్ చేస్తున్నారు. అయితే తనకు ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పారితోషికాన్ని ఇవ్వలేదని, అది ఇస్తే ప్రచారానికి వస్తానని ఆమె చెప్పారు. అయినా సరే మూవీ టీం ప్రమోషన్లకు రావాలని ఆమెను ఫోర్స్ చేస్తున్నారు.
దీంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా వారు తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. అది ఏ మాత్రమూ సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయమై చిత్ర బృందంతో జరిగిన మీటింగ్స్‌లో వారు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారని ఆమె తెలిపారు. పారితోషియం విషయం తేల్చకుండా, తన అనుమతి లేకుండా సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారని ఆమె అన్నారు. దీంతో నెటిజన్లు సైతం పాయల్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.