»Sugar Levels This Is An Ayurvedic Medicine That Controls Sugar Levels
Sugar levels: షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే ఆయుర్వేద ఔషధం ఇది..!
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం (డయాబెటిస్) చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిణామాలు రావచ్చు. ఇక.. వైద్యులు ఎన్ని మందులు సూచించినా... కంట్రోల్ చేయగలుగుతాయి కానీ.. పూర్తిగా పరిష్కారం చూపించవు. అయితే.. ఆయుర్వేదంలో మాత్రం దీనికి పరిష్కారం ఉంది.. అదేంటంటే?
Sugar levels: This is an Ayurvedic medicine that controls sugar levels..!
త్రిఫల
త్రిఫల అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలిక. ఇది ఆమ్ల, బిల్వ, హరీతకీ పండ్ల కలయిక. త్రిఫల పొడిని నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
కలబంద రసం
కలబంద రసం యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తులసి
తులసి ఆయుర్వేదంలో చాలా పవిత్రమైన మూలిక. తులసి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, ఇన్సులిన్ స్రావం మెరుగుపడుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు షుగర్‌ను నియంత్రిస్తాయి.
మెంతుల గింజలలో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి, అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతుల గింజల నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల షుగర్ తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
కాకరకాయ రసం
కాకరకాయ రసం రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రిస్తుంది.
ఉసిరి రసం
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మంట తగ్గుతుంది