»Afghanistan Flash Floods Livelihoods Washed Away Latest Death Toll
Afghanistan Flood: ఆఫ్ఘనిస్తాన్‌లో వరద విధ్వంసం.. 300 మందికి పైగా మృతి
యుద్ధం నుంచి బయటపడిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు మరో సమస్య ఎదురైంది. శుక్రవారం నుంచి దేశంలో సంభవించిన వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. వరదల కారణంగా పొలాలు, రోడ్లు, గ్రామాలు, నగరాల్లోని ఇళ్లు కొట్టుకుపోయి పంటలు నాశనమై విధ్వంసం సృష్టించింది.
Afghanistan Flood: యుద్ధం నుంచి బయటపడిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు మరో సమస్య ఎదురైంది. శుక్రవారం నుంచి దేశంలో సంభవించిన వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. వరదల కారణంగా పొలాలు, రోడ్లు, గ్రామాలు, నగరాల్లోని ఇళ్లు కొట్టుకుపోయి పంటలు నాశనమై విధ్వంసం సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్సులు – బదక్షన్, ఘోర్, బగ్లాన్, హెరాత్ వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
ఇప్పటివరకు వరదలు 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అనేక అంతర్జాతీయ సహాయ సంస్థలు, సమూహాలు ప్రభావిత ప్రాంతాలకు మందులు, ఆహారం, భద్రత, అత్యవసర వస్తు సామగ్రి మొదలైన సహాయ సామగ్రిని సరఫరా చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే సహాయక బృందం పిల్లలు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి మొబైల్ హెల్త్, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్‌లతో కూడిన “క్లినిక్ ఆన్ వీల్స్”ని పంపింది.
బగ్లాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలను వరద తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆకస్మిక వరదలు గ్రామాలను నాశనం చేశాయి. ఇళ్ళు కొట్టుకుపోయాయి. జంతువులు మరణించాయి. పిల్లలు సర్వస్వం కోల్పోయారు. ఈ ప్రాంతంలోని కుటుంబాలు మూడేళ్లుగా కరువుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి తక్షణ సహాయం అందించాలని సేవ్ ది చిల్డ్రన్ కంట్రీ డైరెక్టర్ అర్షద్ మాలిక్ అన్నారు.
వెయ్యికి పైగా ఇళ్లు, వేలాది హెక్టార్ల వ్యవసాయ భూమి, జంతువులు వరదలో ధ్వంసమయ్యాయి. అనేక వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం కోసం ట్రక్కులు చేరుకోవడం కష్టంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే సహాయం చేయాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్య దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలను శనివారం కోరింది. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన బాధితుల కోసం మానవతా సహాయం కోరారు.