Drinking Water Before Brushing : ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు చాలా మంది ఉదయాన్నే రెండు, మూడు గ్లాసుల నీటిని తాగుతూ ఉంటారు. కొందరు బ్రష్ చేసుకున్నాక పరగడుపున తాగితే, కొందరు నిద్ర లేవగానే తాగేస్తుంటారు. బ్రష్ చేసుకోకుండా ముందే నీటిని(Water) తాగడం మంచిదా? కాదా? అని చాలా మందికి అనుమానం ఉంటుంది. అయితే ఇది మంచి అలవాటేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నోటిని శుభ్రం చేసుకోవడానికి మునుపే నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు(
Health Benefits) ఉన్నాయంటున్నారు. అవేంటంటే..?
పరగడుపున నీటిని(Water) తాగడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. అందుకనే చాలా మంది సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగే ప్రయత్నం చేస్తారు. అయితే బ్రష్ చేసుకోకుండా నీటిని తాగడం వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా మన దరి చేరకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందంటున్నారు. తద్వారా మనకు కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఊబకాయం, మలబద్ధకం, హైబీపీ, మధుమేహం లాంటి వాటితో బాధలు పడేవారు బ్రష్ చేసుకోడానికి ముందే గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే బరువు తగ్గాలనే ఆలోచనల్లో ఉన్నవ వారు సైతం ఇలా నీటిని తాగడం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇంకా బ్యాడ్ బ్రీత్ కూడా తగ్గుతుంది. నోటిలో బ్యాక్టీరియాలు తొలగిపోవడానికి లాలాజలం సహకరిస్తుంది. మనం పడుకున్నప్పుడు లాలాజలం ఊరడం తక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో మన నోట్లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతాయి. అందువల్లనే నోటి దుర్వాసన వస్తుంది. అందుకనే లేవగానే ముందు నీటిని తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ బ్యాక్టీరియా పొట్టలోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పని చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.