పలు హాలీవుడ్ ప్రిడిక్షన్స్ ఈసారి ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో ఉంటాడని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆస్కార్ నామినేషన్స్‌లో తారక్‌కు చోటు దక్కలేదు. అయినా ఆస్కార్ లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడంతో.. ఒక అభిమానికి ఇది చాలు అని సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడంతో.. మరోసారి పండగ చేసుకుంటున్నారు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డ్స్ అఫీషియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. మార్చి 12న ఆస్కార్ లైవ్ కోసం అంటూ.. ట్విట్టర్ ది అకాడమీ అఫిషియల్ అకౌంట్లో 31 సెకన్ల నిడివి గల వీడియోని విడుదల చేశారు. దానికి Movies are dreams that you never forget.. అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ 31 సెకన్ల ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడం విశేషం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎపిక్ షాట్‌ను ఆస్కార్ ప్రోమోలో పెట్టారు. క్లైమాక్స్‌లో భీమ్ బైక్‌ను కాలితో తన్నే షాట్‌ను ఆస్కార్ అఫీషియల్ ప్రోమోలో చూడొచ్చు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఐకానిక్ షాట్ ఆఫ్ భీమ్ అంటూ రచ్చ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్స్ మధ్యన తారక్ నిలవడం గ్రేట్ అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్స్ అంటేనే సినిమాలకు శిఖరం.. అలాంటి ప్రమోషన్ వీడియోలో ఓ తెలుగు హీరో కనిపించడం మామూలు విషయం కాదని అంటున్నారు. ఇకపోతే.. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ పాట.. ఆస్కార్ కూడా కొట్టేయడం ఖాయమంటున్నారు. ఏదేమైనా.. ఓ తెలుగు సినిమా ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిందంటే.. ఆ క్రెడిట్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళిదే.