Rajasab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు . గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్.. త్వరలోనే ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. మారుతి ఈ సినిమాను.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా తెరకెక్కిస్తున్నాడు. వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మస్త్ ఉన్నాడు ప్రభాస్.
అందుకే.. మొదట్లో మారుతితో సినిమా వద్దని చెప్పిన రెబల్ ఫ్యాన్స్.. ఇప్పుడు రాజాసాబ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురితో కలిపి ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ పాటలో ముగ్గురితో కలిసి అదిరిపోయే స్టెప్పులేయనున్నాడట ప్రభాస్. మంచి డాన్స్ మూమెంట్స్‌తో ఈ పాట ఉండనుందని సమాచారం.