»Heavy Snowfall In Bandipora And Kupwara Machil Sector
Snowfall : ఇక్కడ ఎండలు…. కశ్మీర్లో భారీగా వర్షాలు, హిమపాతం!
ఓ వైపు దక్షిణాదిన ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు భారత్లో పై వైపున ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు, దండిగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Snowfall : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేనంతగా 45 డిగ్రీలను దాటి ఏప్రిల్ నెలలోనే నమోదు అవుతున్నాయి. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే కశ్మీర్లో మాత్రం వాతావరణం వేరేలా ఉంది. కశ్మీరు లోయ పై భాగాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భారీగా మంచు సైతం కురుస్తూ ఉంది.
అక్కడ వరుసగా శని, ఆది వారాల్లో వానలు ముంచెత్తాయి. వాటికి తోడు మంచు సైతం కొన్ని చోట్ల కురుస్తోంది. ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా మంచు కురుస్తుండటంతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. బండి పొరా జిల్లా , కుప్వారా(Kupwara) మాచిల్ సెక్టార్లలో పరిసరాలన్నీ మంచుతో (Snowfall) కప్పబడిపోయాయి. రోడ్ల మీద కూడా మంచు పేరుకుపోయింది. దీంతో రోడ్లపై దాన్ని తొలగించి వాహనాల రాకపోకల్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జమ్ము డివిజన్లోని గుల్మార్గ్, సోనామార్గ్, పీర్ కి గాలి, ముఘల్ రోడ్డు తదితర ప్రాంతాల్లోఏ మూడు అంగుళాల మేర మంచు కురిసింది. అత్యధకంగా అచూరాగురేజ్, బందిపోరా, కుప్వారాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఐదంగుళాల మేర మంచు(Snowfall) కురిసింది. ఆదివారం అర్ధరాత్రి వరకు ఇలాగే మంచు కురుస్తూ ఉంది. అయితే వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, వేగంగా గాలులు వీయడం లాంటివి ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.